ప్రజాశక్తి - గోనెగండ్ల
రైతులందరూ వారి పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో ఖరీఫ్‌కు సంబంధించిన పంట సాగు వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఎడిఎ మహ్మద్ ఖాద్రీ, ఎఒ హేమలత తెలిపారు. శుక్రవారం గోనెగండ్లలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, ఎంపిఇఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2023-ఖరీఫ్ పంట నష్టం పరిహారం కోసం రైతులు తమ పరిధిలోని రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలను ఈనెల 20లోపు తప్పనిసరిగా సమర్పించాలని అన్నారు.