Sep 13,2023 21:53

ప్రజాశక్తి - గణపవరం
             గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం అర్ధవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 200 మంది విద్యార్థులకు కంటి పరిక్షలు నిర్వహించినట్లు నేత్ర వైద్యులు ఐ.శ్రీనివాస్‌ చెప్పారు. వీరిలో 21 మందికి కళ్లజోళ్లు అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ హెచ్‌ఎం ప్రసన్న ఆంజనేయులు, సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌బాబు, ఎంఎల్‌హెచ్‌పి ఎస్‌.దివ్యభారతి, ఎఎన్‌ఎం ఇ.లక్ష్మీకాంతమ్మ, హెల్త్‌ అసిస్టెంట్‌ బి.రవికుమార్‌, ఆశావర్కర్లు పాల్గొన్నారు.