May 17,2023 22:21

కాకినాడ కార్పొరేషన్‌ సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ మహేష్‌కుమార్‌

పాత వస్తువుల సేకరణకు 14 కేంద్రాల ఏర్పాటు
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మేరీ లైఫ్‌.. మేరా స్వచ్ఛ షహర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌ చెప్పారు. కాకినాడ స్మార్ట్‌ సిటీ సమావేశం మందిరంలో అధికారులతో కమిషనర్‌ చర్చించారు. పాత వస్తువుల సేకరణ కోసం కాకినాడ నగరంలోనికాకినాడ నగరంలోని బోట్‌ క్లబ్‌ పార్క్‌, జన్మభూమి పార్క్‌, సాంబమూర్తి నగర్‌ లోని లైబ్రరీ బిల్డింగ్‌ అంబేద్కర్‌ పార్క్‌, ఎంజి స్కూల్‌ ఎదురుగా మాస్టర్‌ కార్యాలయం, ఏటిమొగ వెహికల్‌ యార్డ్‌, జగన్నాధపురం పాత ఈసేవ బిల్డింగ్‌, ముగ్గుపేట కమ్యూనిటీ హాల్‌, జ్యోతుల మార్కెట్‌ ఈ వేస్ట్‌ సెంటర్‌, పాత కార్పొరేషన్‌ కార్యాలయం, కొత్తపేట చిన్న మార్కెట్‌ వద్ద గల కమ్యూనిటీ హాల్‌, వార్ఫ్‌ రోడ్‌ కమ్యూనిటీ హాల్‌, బాల భవన్‌ వద్ద మాస్టర్‌ ఆఫీస్‌, వివేకానంద పార్క్‌, శ్రీనివాస బ్యాంక్‌ కాలనీ షెడ్‌ వద్ద ఈ నెల 20వ తేదీ నుండి జూన్‌ 5వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాత వస్తువులను సేకరించనున్నట్టు తెలిపారు. కార్యక్రమాన్ని పర్యవేక్షిం చేందుకు నోడల్‌ అధికారులను కూడా నియమిం చినట్టు కమిషనర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. ఎడిసి నాగ నరసింహారావు మాట్లాడుతూ రెడ్యూస్‌- రీ సైకిల్‌ -రీ యూజ్‌ నినాదంతో చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలు కూడా తమ వంతు సహకారించాలని కోరారు. సమావేశంలో డిఇ మాధవీ, ఎంహెచ్‌వో డాక్టర్‌ పృధ్వీచరణ్‌, టిపిఆర్‌ఒ మానే కృష్ణమోహన్‌, కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. పెద్దాపురం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి జూన్‌ 4వ తేదీ వరకు ప్రతి సచివాలయం పరిధిలో పనికిరాని ప్లాస్టిక్‌ వస్తువులు, కాగితాలు, అట్టలు పుస్తకాలు, బట్టలు, బూట్లు, చెప్పులు సేకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ జె సురేంద్ర తెలిపారు. మేరా లైఫ్‌ -మేరా స్వచ్ఛ షహర్‌లో భాగంగా రెడ్యూస్‌ - రీసైకిల్‌ - రీ యూజ్‌ (ఆర్‌ ఆర్‌ ఆర్‌) పురస్కరించు కుని ఈ కార్యక్రమం నిర్వహిస్తు న్నామన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసే స్టాల్స్‌ వద్ద ప్రజలు తమకు పనికిరాని వస్తువులను అందజేయా లన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనే విధంగా మెప్మా, మున్సిపల్‌ సిబ్బంది, మహిళలు పట్టణ పరిధిలో బుధవారం నుండి ప్రదర్శనలు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రజలందరూ పాల్గొని త్రిపుల్‌ ఆర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.