Oct 11,2023 19:38

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
   ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ తలసేమియా భవనంలో బుధవారం 20 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియా, సికిల్స్‌ ఎనీమియా వ్యాధి చిన్నారులు నెలకు రెండు నుంచి మూడుసార్లు రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుందని, కాబట్టి స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి తలసేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రతీ వారం తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి రోజున ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బుధవారం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 50 మందికి మానవత ట్రెజరర్‌ అల్లూరి మోహిని భోజనం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కెబి.సీతారాం, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ఆర్‌కె.వరప్రసాదరావు, అల్లూరి మోహిని, కడియాల కృష్ణారావు, మేతర అజరు బాబు, సాయి సుధా పాల్గొన్నారు.