Jul 27,2023 22:09

న్యూఢిల్లీ : మారుతి సుజుకి తమ డ్రైవింగ్‌ స్కూల్స్‌లో ఇప్పటి వరకు 20 లక్షల మందికి డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చి.. నూతన మైలురాయిని చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. దేశంలోని 230 పైగా నగరాల్లోని 520 పైగా మారుతి సుజుకి డ్రైవింగ్‌ స్కూళ్లలో థియరీ, ప్రాక్టికల్‌ శిక్షణ ఇస్తుందని పేర్కొంది. 2005లో తొలిసారి డ్రైవింగ్‌ స్కూల్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. తొమ్మిది భాషాల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించింది.