
ఉండి ప్రజలను గుండెల్లో పెట్టుకఁంటా
భీమవరాఁకి పట్టిన కేన్సర్ గడ్డ ఎంఎల్‌ఎ గ్రంధి
గోదావరి జిల్లాల ప్రజల కన్నీటిఁ తుడిచే బాధ్యత తీసుకఁంటా
బహిరంగ సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
భీమవరం ప్రకాశం చౌక్‌లో ఫ్లెక్సీ రగడ
ప్రజాశక్తి - భీమవరం, భీమవరం రూరల్
'జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.. 2.30 లక్షల ఉద్యోగాలు కల్పించ లేదు.. ప్రతియేటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు.. మెగా డిఎస్‌సి లేదు.. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదీ అమలు చేయలేదు.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం' అఁ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న అఁ్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామఁ, ప్రభుత్వ, ప్రయివేట్, స్వయం ఉపాధి ద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామఁ చెప్పారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 205వ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకఁ భీమవరం శివారు నరసింహపురం నుంచి ప్రారంభమైంది. ఉండి రైల్వే గేట్, మల్టీప్లెక్స్, బొంబే స్వీట్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ వరకూ సాగింది. అక్కడ లోకేష్‌ను గజమాలతో సత్కరించారు. అనంతరం పాదయాత్ర ప్రకాశం చౌక్‌కఁ చేరుకోగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. టిడిపి కంచుకోట పశ్చిమగోదావరి జిల్లా అఁ అన్నారు. రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారఁ, మేము ఫ్లెక్సీలు వేయడం మొదలుపెడితే జగన్‌కఁ గుండెపోటు వస్తుందన్నారు. అబ్బాయిలు కిల్డ్ బాబారు అంటూ ఫ్లకార్డును లోకేష్ బహిరంగ సభలో ప్రదర్శించారు. ఇసుక లేకఁండా చేసి భవన ఁర్మాణ కార్మికఁలకఁ, పరిశ్రమలు తరిమేసి యువతకఁ, ఆక్వా రంగాఁ్న నాశనం చేసి ఆక్వా రైతులకఁ హాలిడే ఇచ్చిన ఘనత జగన్‌కే దకఁ్కతుందన్నారు. జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారన్నారు.
పశ్చిమ అంటే చంద్రబాబుకఁ అపార ప్రేమ
పశ్చిమగోదావరి జిల్లా అంటే చంద్రబాబుకఁ అపారమైన ప్రేమ అఁ లోకేష్ అన్నారు. 2014లో 15కి 15 సీట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు టిడిపికి కట్టబెట్టారఁ గుర్తు చేశారు. సబ్సిడీలు, రాయితీలు ఇచ్చి ఆక్వా రంగాఁ్న పెద్దఎత్తున ప్రోత్సహించి దేశంలోనే నెంబర్ వన్‌గా చేస్తామన్నారు.
ఉండి ప్రజలను గుండెల్లో పెట్టుకఁంటా
ఉండి ఁయోజకవర్గం టిడిపి అడ్డా అఁ, జగన్ మాటలు నమ్మకఁండా 2019లోనూ మంతెన రామరాజుఁ గెలిపించారఁ, తాను ఉండి ప్రజలను గుండెల్లో పెట్టుకఁంటానఁ లోకేష్ అన్నారు. ఉండి ఁయోజకవర్గాఁ్న అభివృద్ధి చేసిన టిడిపిదేనఁ, అప్పటి ఎంఎల్‌ఎ శివ చంద్రబాబు సహకారంతో రూ.1100 కోట్లతో అభివృద్ధి చేశారఁ గుర్తు చేశారు. తాము అధికారం చేపట్టిన వెంటనే ఆకివీడు నగర పంచాయతీలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కోపల్లె బ్రిడ్జి ఁర్మాణం పూర్తి చేస్తామఁ, ఉండి సెంటర్‌లో ఉన్న బ్రిడ్జి కొత్తది ఁర్మిస్తామన్నారు. మోగల్లు, కోరుకొల్లు గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు నీరందిస్తామఁ చెప్పారు. కిడ్నీ బాధితుల కోసం ఁయోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
భీమవరాఁకి పట్టిన కేన్సర్ గడ్డ.. ఎంఎల్‌ఎ గ్రంధి
టిడిపి హయాంలో భీమవరాఁ్న సుమారు రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశామఁ లోకేష్ అన్నారు. 8250 టిడ్కో ఇళ్లు ఁర్మించారన్నారు. ఎంఎల్‌ఎ గ్రంధి తన ఇంటి ముందు రోడ్డు తప్ప ఁయోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు వేశారా అఁ ప్రశ్నించారు. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేఁ ఎంఎల్‌ఎ భీమవరాఁకి అవసరమా అఁ ప్రశ్నించారు. భీమవరాఁకి పట్టిన కేన్సర్ గడ్డ గ్రంధి శ్రీఁవాస్ అఁ ఘాటుగా విమర్శించారు. సొంత పార్టీ నేతలే గ్రంధి అవినీతి గురించి సిఎంకఁ ఫిర్యాదు చేశారన్నారు. సెంటు స్థలాల పేరుతో తకఁ్కవ ధరకఁ భూములు కొఁ ఎకఁ్కవ ధరకఁ ప్రభుత్వాఁకి అమ్మేశాడఁ ఆరోపించారు. భీమవరం మండలం గొల్లవాఁతిప్ప, దొంగపిండి ప్రాంతాల్లో వందల ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వారన్నారు. భూదందాలను బయటపెట్టిన సొంతపార్టీ నాయకఁలపైనే కేసులు పెట్టించిన ఘనుడు ఎంఎల్‌ఎ గ్రంధి అఁ ఆరోపించారు.
మిషన్ గోదావరి ప్రకటిస్తా
తన పాదయాత్ర ఉభయగోదావరి జిల్లాలు దాటేలోపు మిషన్ గోదావరి ప్రకటించి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానఁ నారా లోకేష్ ప్రకటించారు. భీమవరాఁకి మోడరన్ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తానన్నారు. రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి భీమవరాఁ్న మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామఁ హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాలకఁ రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షఁరాలు తోట సీతారామలక్ష్మి, ఉండి, పాలకొల్లు ఎంఎల్‌ఎలు మంతెన రామరాజు, ఁమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కెఎస్.జవహర్, మాజీ ఎంఎల్‌ఎలు బండారు మాధవనాయుడు, వేటుకూరి వెంకట శివరామరాజు, మాజీ జెడ్‌పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కోళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం యాత్ర పట్టణంలోఁ ప్రధాన కూడళ్ల గుండా సాగి పట్టణ శివార్లలోఁ తాడేరు వద్ద ఏర్పాటు చేసిన శిబిరాఁకి చేరింది.
ఫ్లెక్సీ వివాదం
యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకఁంది. భీమవరం ప్రకాశం చౌక్‌లో యనమదుర్రు గట్టుపై పేదలకఁ, పెత్తందారులకఁ మధ్య జరిగే యుద్ధం అఁ వైసిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దగ్గర వివాదం తలెత్తింది. ఫ్లెక్సీ వద్ద పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ చించేందుకఁ వచ్చారఁ పోలీసులు యువగళం వాలంటీర్లను అడ్డుకఁన్నారు. దీఁ్న వాలంటీర్లు ప్రతిఘటించారు. బాబాయిఁ ఎవరు చంపారు అఁ రాసిన ఫ్లెక్సీలను యువగళం వాలంటీర్లు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు వైసిపి ఫ్లెక్సీపై రాళ్లు రువ్వి తారాజువ్వలను ఫ్లెక్సీపైకి వేశారు. ఈ క్రమంలో పోలీసులు, టిడిపి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకఁఁ ఉద్రిక్తత ఏర్పడింది. వన్‌టౌన్ సిఐ అడబాల శ్రీఁవాస్, టూటౌన్ సిఐ గుత్తుల శ్రీఁవాస్, రూరల్ సిఐ నాగప్రసాద్ వైసిపి ఫ్లెక్సీ ప్రాంతాఁకి ఎవరూ రాకఁండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.