ప్రజాశక్తి-కోటనందూరు మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకష్ణుడు 20 ఏళ్లుగా తిరగని ప్రతి వీధికీ నేడు తిరుగుతూ ప్రజలకు క్షమాపణ చెబుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తుని పట్టణం, ఎస్.అన్నవరం, కోటనందూరు మండలం ఇండుగపల్లిలో వైఎస్‌ఆర్ సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడడంతో యనమల రామకష్ణుడికి గతంలో ఎన్నడూ లేనంత విధంగా నియోజకవర్గ ప్రజలపై అమితమైన ప్రేమ పెరిగిపోయిందన్నారు. గ్రామాల్లో మోకాళ్ళ మీద తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రసారం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం రాష్ట్రంలో 26వ స్థానంలో ఉండేదని జగన్ ప్రభుత్వంలో ఆరో స్థానానికి ఎగబాకిందన్నారు. వైసిపి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొప్పన రాము, వైస్ ఎంపిపి సోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, పోతల రమణ, నాగేంద్ర నెహ్రూ, ఎంపిపి లగుడు శ్రీనివాస్, కుంచే అచ్చిరాజు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకట కష్ణాజీ, లాలం బాబ్జి, గొర్ల రామచంద్రరావు, అచ్చినాయుడు, గంగాధర్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










