Apr 08,2023 00:04

ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు, స్థానికులు

సిపిఎం అధ్వర్యాన ఖాళీ బిందెలుతో ఆందోళన
ప్రజాశక్తి-విఆర్‌.పురం

మండలంలోని రాజుపేట పంచాయితీ పరిధి మొద్దులగూడెంలో మోటారు మరమ్మతుకు గురై రెండు నెలలుగా తాగునీరు రాక నానా అవస్థలు పడుతుంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు విమర్శించారు. మోటారుకు మరమ్మతులు చేసి తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం అధ్వర్యంలో స్థానికులు శుక్రవారం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, చిన్నబాబు మాట్లాడుతూ రెండు నెలల పాటు మోటారును ఎందుకు మరమ్మతు చేయలేదని ప్రశ్నించారు. వేసవిలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుంజా నాగిరెడ్డి, కుంజా కన్నయ్య, గుండెపూడి లక్ష్మణరావు, సొడి మల్లయ్య, చల్లా హజ్రత్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.