
పోస్టర్ ఆవిష్కరిస్తున్న యు టి ఎఫ్ నేతలు
ప్రజాశక్తి-మాడుగుల:ఉపాధ్యాయ సమస్యల కోసం సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని యుటిఎఫ్ అధ్వర్యంలో సోమవారం ఘాట్ రోడ్ జంక్షన్‌లో పోస్టర్ అవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యుటీ ఎఫ్ నేతలు చంద్రరావు, ప్రసాద్, శివ కుమార్, ఆనంద్ పాల్గొన్నారు.
రావికమతం:పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎపిసిపిఎస్‌ఇఎ అనకాపల్లి జిల్లా కార్యదర్శి గేదెల సింహద్రప్పడు కోరారు. మండల కేంద్రంలోని కళ్యాణ మండపం ఆవరణలో చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెప్టెంబరు 1 వ తేదీన తలపెట్టిన ర్యాలీకి వేలాదిగా ఉద్యోగులు తరలి రావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మల్లునాయుడు, రాంబాబు, శ్రీను, నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.