19న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్లు ప్రారంభం
ఘనంగా రెస్టారెంట్స్ అతి పెద్ద కిచెన్ సెంటర్ ప్రారంభం
ప్రజాశక్తి -తిరుపతి సిటీ: జబర్దస్త్ ఆర్పీ బ్రాండ్ రాష్ట్రంలో ఆరంభమై అశేష ప్రజాదరణ పొందుతున్న నెల్లూరు పెద్దిరెడ్డి చేపల పులుసు రెస్టారెంట్లు ఈనెల 19న తిరుపతి నగరంలో ప్రారంభం కానున్నాయి. ఈమేరకు చింతచేను రోడ్డులోని స్టార్ లైట్ హోటల్ ఎదురుగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్లకు సంబంధించిన సంప్రదాయ కట్టెల పొయ్యితో నూతనంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద కిచెన్ సెంటర్ ను గురువారం ఉదయం పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ల అధినేత జబర్దస్త్ ఆర్పీ విచ్చేసి తిరుపతి రెస్టారెంట్ల ప్రాంచేజి ప్రతినిధులు వంశీకష్ణ, ఏడుకొండలు, బాలాజీ కిరణ్, చంద్రశేఖర్, సుబ్రమణ్యంలతో కలిసి కిచెన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్పీ మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన తాను నెల్లూరు చేపల ప్రత్యేకతను గుర్తించి అత్యంత ప్రసిద్ధి గాంచిన బ్రాండ్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో కూడిన ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశం ఏడాది డిసెంబర్ 9 హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వంటకాల రెస్టారెంట్ ను ఆరంభించి అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందామన్నారు. తమ బ్రాంచుల ద్వారా అనువజ్ఞులైన మాస్టర్స్ తో, ఒక ప్రత్యేక ఫార్ములాతో నోరూరించే అన్ని రకాల చేపల పులుసులతో పాటు రాగి సంగటి, వైట్ రైస్ వంటి ఆహార పదార్థాలు అందిస్తూ ప్రభంజనం సష్టిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తిరుపతి వారితో ఫ్రాంచేజీతో పదార్థాలు అందిస్తూ ప్రభంజనం సష్టిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగం గానే తిరుపతి వారితో ఫ్రాంచేజీ తో తిరుపతి ప్రజ లకు తమ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు వంట కాలు అందిం చడం మహద్భాగ్య మ న్నారు. తమ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మరింత విస్తరణలో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు సంబంధించిన ఫ్రాంచేజీలను అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారు తిరుపతి బ్రాంచులో సంప్రదించాలని కోరారు. తిరుపతి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ప్రతినిధులు వంశీకష్ణ, ఏండు కొండలు, బాలాజీ కిరణ్, సుబ్రమణ్యం, చంద్రశేఖర్ మాట్లాడుతూ వేరు వేరు వ్యాపారస్తులైన తాము నేటి ఆధునిక సమాజంలో ప్రజలకు సరికొత్త వంటకాలు అందించాలనే ఉద్దేశంతో జబర్దస్త్ ఆర్పీని సంప్రదించి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ల ఫ్రాంచేజీలను పొందా మన్నారు. తద్వారా ఈనెల 19న తిరుపతిలో ఐదు బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లకు సంబంధించిన వంటశాలను సువిశాలమైన స్థలంలో అతి పెద్ద కిచెన్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు.తమ కొత్త రెస్టారెంట్ల ద్వారా కొరమేను, బొమ్మడాయి, గండి, సన్న చేప, చేప తలకాయ వంటి అనేక రకాల నోరూరించే రీతిలో చేపల పులుసులు,రాగి సంగటి,వైట్ రైస్ అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.










