Oct 17,2023 20:16

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని 19 నుంచి యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగే నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప కోరారు. మంగళవారం యుటిఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కేంద్రం ఇచ్చిన మెమో 57ను అమలు చేసి 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులందరికీ ఒపిఎస్‌ను అమలు చేయాలని తెలిపారు. 19న ఉదయం 10 గంటల నుంచి కృష్ణదేవరాయలు ధర్నా చౌక్‌ దగ్గర, 20 నుంచి తాలూకా కేంద్రాలైన ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండలో నిరవధిక నిరసన దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఎస్‌.నరసింహులు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మల్లారి నాగరాజు, ఆడిట్‌ కమిటీ సభ్యులు కౌలన్న, లక్ష్మన్న, చంద్రపాల్‌, పెద్దారెడ్డి, బి.రామాంజనేయులు, ఎం.నాగరాజు, రాందాస్‌, హనీఫ్‌, శ్రీనివాసులు, వై.రామాంజనేయులు, శాంతన్న పాల్గొన్నారు.