న్యూఢిల్లీ : వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.100 పెరిగింది. రెండు నెలల్లో సిలిండర్ ధరను పెంచడం ఇది రెండోసారి. బుధవారం నుండి ఈ ధర అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా ధర పెంపుతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,833కు చేరింది. చెన్నైలో రూ.1,999.50, కోల్‌కతాలో రూ.1,943, ముంబయిలో రూ.1,785.50కు చేరింది. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది.










