May 07,2023 23:54

పట్టుబడ్డ గంజాయి

ప్రజాశక్తి-గొలుగొండ:నర్సీపట్నంకు చెందిన ఓ ప్రైవేటు బస్సులో 19 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని గొలుగొండ ఎస్‌ఇబి సిఐ రాజారావు పేర్కొన్నారు. అల్లూరి జిల్లా చిత్రకొండ నుంచి నర్సీపట్నానికి వెళుతున్న ఎస్‌ఆర్‌సిఎంటికి చెందిన బస్సులో గంజాయి రవాణా జరుగుతుందని ముందస్తు సమాచారం రావడంతో గొలుగొండ మండలం ఏటిగైరంపేట వద్ద శనివారం సాయంత్రం బస్సును ఆపి తనిఖీ చేశామన్నారు. 19 కేజీల గంజాయి లభ్యమైందని, నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద 12వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నామన్నారు.