May 16,2023 17:53

మాట్లాడుతున్న రామాంజనేయులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
వికలాంగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 18న చలో కలెక్టరేట్‌ కార్యక్రమం చేపడుతున్నట్లు విహెచ్‌పిఎస్‌ తాలూకా అధ్యక్షులు కె.రామాంజనేయుడు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బీసీ.నాగరాజు తెలిపారు. మంగళవారం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ బడ్జెట్‌ను, హక్కులను, చట్టాలను, రాయితీ, రిజర్వేషన్లను కాలరాస్తోందని విమర్శించారు. వికలాంగుల మౌలిక వసతులు, సదుపాయాల కల్పన, పడుతున్న ఇబ్బందులు, అనుభవిస్తున్న సమస్యలపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని తెలిపారు. వికలాంగులకు రూ.6 వేలు సామాజిక పింఛన్లు పెంచాలని, వికలాంగుల సంక్షేమ హక్కుల చట్టం-2016ను అమలు చేయాలని కోరారు. వికలాంగుల సంక్షేమ శాఖకు, కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై విహెచ్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 18న 'చలో కలెక్టరేట్‌' చేపడుతున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ పాల్గొంటున్నారని చెప్పారు. ఎమ్మినూరు తాలూకా స్థాయిలోని వికలాంగులందరూ భారీ ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. విహెచ్‌పిఎస్‌ తాలూకా కార్యదర్శి ఎం.పెద్దయ్య, పట్టణ అధ్యక్షులు బి.రఘువీరా, మండల అధ్యక్షులు బి.శ్రీనివాసులు, బి.రంగన్న, కోశాధికారి బి.తిక్కయ్య, ఈసీ మెంబర్లు కడిమెట్ల జి.నాగరాజు, వి.నరసింహులు, ఎం.రామకృష్ణ, రామదాస్‌, పాండు, రంజాన్‌, జబ్బార్‌, విహెచ్‌పిఎస్‌ గోనెగండ్ల మండల నాయకులు బి.సోమన్న, నాగశేషమ్మ, బాషా, రంగన్న, విహెచ్‌పిఎస్‌ నందవరం మండల నాయకులు గుంటెప్ప, మంగలి నాగరాజు, బసవరాజు, లక్ష్మన్న, మంగమ్మ పాల్గొన్నారు.