Aug 13,2023 20:57

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

 కడప అర్బన్‌ : కడప ఉక్కు సాధన కోసం కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో డివైఎఫ్‌ఐ యువజన సంఘం జిల్లా కమిటీ అధ్వర్యంలో ఈనెల 18న రాష్ట్ర స్థాయి ఉక్కు సదస్సు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్‌ తెలిపారు. ఉక్కు సదస్సు పోస్టర్లు ఆదివారం స్థానిక జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప ఉక్కు పైన కేంద్ర ప్రభుత్వం సీత కన్ను వేసింది అన్నారు. ఇక్కడి ప్రాంత యువత భవిష్యత్‌ కడప ఉక్కు అన్నారు. యువతకు భవిత కోసం కడప ఉక్కే ఏకైక పరిష్కారం అన్నారు. కడప ఉక్కును ఆంధ్రుల హక్కుగా కడప వేదికగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని చెప్పారు. ఈనెల18 న కడప యుటిఎఫ్‌ భవన్‌ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సదస్సుకు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌.గేయానంద్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఉక్కు సాధన ఐక్య వేదిక జిల్లా అద్యక్షులు బి.నారాయణ, మాజీ డివైఎఫ్‌ఐ నాయకులు జి.చంద్రశేఖర్‌ హాజరు అవుతున్నారన్నారు. సదస్సుకు కార్యక్రమంలో నగర అధ్యక్ష, కార్యదర్శులు షాకీర్‌, డి.ఎం. ఓబులేసు, నగర ఉపాధ్యక్షులు విజరు, జగదీష్‌ పాల్గొన్నారు.