May 18,2023 00:01

దుగ్గిరాలలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ

దుగ్గిరాల: ఐదేళ్లకు పైగా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు గత ఏడాది వరకు కేంద్ర ప్రభుత్వం జీతాలు చెల్లించిందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత వదిలేయడం, రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకపోవడంతో గ్రీన్‌ అంబాసిడర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. దుగ్గిరాలలో బుధవారం నిర్వహించిన గ్రామపంచా యతి కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేతాజీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అసలే అంతంత మాత్రం ఆదాయాలతో నెట్టుకొస్తున్న అత్య ధిక గ్రామపంచాయతీల గ్రీన్‌ అంబాసిడర్ల కు తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి జీతాలు చెల్లించేందుకు నిర్ణయం చేయక పోతే అత్యధిక గ్రామపంచాయతీలలో వారిని తొలగించే అవకాశం ఉందని, తద్వారా గ్రామాలలో పారిశుధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, వేలాదిమంది గ్రీన్‌ అం బాసిడర్ల కుటుంబాలు పనులు కోల్పోయి వీధిన పడాల్సి వస్తుందని అన్నారు. పార్ట్‌ టైం, టెండర్‌ కార్మికుల రెన్యువల్‌ ఆర్డర్లు ఏడాది పొడుగునా మంజూరుకు నోచు కోవడం లేదని, అధికారులు ఈ విష యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తక్షణమే ఆర్డర్లు జారీ చేయాలని కోరారు. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు అనూ హ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏళ్ల తర బడి వీరు జీతాల పెంపుదలకు నోచు కోవడం లేదని, ఈ ఏడాది రెన్యువల్‌ ఆర్డర్ల సందర్భంగా అందరికీ ధరల పెరుగు దలకు అనుగుణంగా జీతాలు పెంపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పంచాయతి కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 18న జరిగే చలో గుంటూరు కార్యక్రమంలో జిల్లాలోని గ్రామపంచాయతి కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు పెరవలి శ్రీరాములు, సిఐటియు నాయకులు బాల రాజు, యూనియన్‌ మండల నాయకులు బి.నరసింహారావు, పి.కోటేశ్వరరావు, కే.దీన కుమారి, కె.రత్నజ్యోతి పాల్గొన్నారు.

సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోండి


మంగళగిరి: వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మి కులు ఎదుర్కొంటున్న సమస్యలను కార్మి కులు సంఘటితంగా ఉండి ఉద్యమించి సమస్యలను పరిష్కరించుకోవాలని సిఐట ియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై,నేతాజీ అన్నారు. మంగళగిరి సిఐటియు కార్యా లయంలో నియోజకవర్గ స్థాయి సిఐటియు నాయకుల విస్తృత స్థాయి సమావేశం బుధ వారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి జిల్లా సిఐటియు నాయకులు వేముల దుర్గా రావు అధ్యక్ష వహించారు. నేతాజీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్క రించుకోవడానికి ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని విమ ర్శించారు. ఇలాంటి తరు ణంలో కార్మి కులను సంఘటిత పరచాల్సిన అవసరం ఉందని అన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో, కార్పొరేషన్‌ లో పని చేస్తున్న శాని టేషన్‌ కార్మికులు, అసంఘ టిత రంగ కార్మి కులు, ఎయిమ్స్‌ లో పని చేస్తున్న కార్మి కులు, ఎన్నారై ఆస్పత్రిలో చేస్తున్న కార్మి కులు తమ సమస్యల పరి ష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు శ్రమ దోపిడి గురవుతున్నారని , కనీస వేతన చట్టం కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని జగన్‌ మోహన ్‌రెడ్డి ప్రభుత్వం రోడ్ల మీదకు నిరసనను తెలియజేసినందుకు రానివ్వకుండా నిర్బం ధం చేస్తున్నారని విమర్శించారు. ప్రభు త్వాన్ని ప్రశ్నించే వారందరినీ జైల్లో పెట్టేం దుకు పూనుకున్నారని విమర్శించారు. ఇలాంటి స్థితిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారానికి సంఘటితంగా ఉద్య మించాలని పిలుపు నిచ్చారు. ఎయి మ్స్‌లో ఇటీవల తొలగించిన కార్మికులను పనిలో పెట్టేందుకు జరిపిన పోరాటాన్ని అభినందించారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, సిఐ టియు జిల్లా నాయకులు ఎం రవి, ఎస్‌ ఎస్‌.చంగయ్య, ఎం భాగ్యరాజు, జై బాల రాజు, బి వెంకటేశ్వర్లు, జేవి రాఘవులు, వై .కమలాకర్‌ పాల్గొన్నారు.