Apr 30,2023 23:26

పట్టుబడ్డ గంజాయి నిందితులతో పోలీసులు

ప్రజాశక్తి- గొలుగొండ: మండలంలో ఎఎల్‌ పురం బస్టాండ్‌ వద్ద 18 కిలోల గంజాయి, నలుగురు నిందితులను పట్టుకున్నామని కృష్ణదేవిపేట ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ఆదివారం ఉదయం ఏఎల్‌ పురం బస్టాండ్‌ లో బస్‌ కోసం వేచి చూస్తున్న తమిళనాడుకు చెందిన నలుగురును పోలీసులు తనిఖీలు చేశారు. వారి దగ్గర ఉన్న బ్యాగుల్లో 18 కేజీల గంజాయి దొరికింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శంకర్‌, శక్తివీర్‌, శివశక్తి, నూర్‌ మహమ్మద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ.1500 నగదు, రెండు సెల్‌ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ తరలించినట్టుగా ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.