Aug 14,2023 22:11

ప్రజాశక్తి - చింతలపూడి
     జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆరో దశలో ఎర్రగుంటపల్లి, గనిజర్ల గ్రామాలు గుర్తించబడ్డాయని జిల్లా నోడల్‌ టీం లీడర్‌ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఎర్రగుంటపల్లి పిహెచ్‌సిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకూ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిగ్మా రీఛార్జ్‌ ఇన్సిట్యూట్‌ ప్రెయివేట్‌ లిమిటెడ్‌ సత్తిపండు, ఎం.పార్వతీశం, టి.శ్రీనుబాబు, డి.సుబ్రహ్మణ్యం, ఎర్రగుంటపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి కె.నరేష్‌, డాక్టర్‌ మంజుష, జి.రమణమ్మ, ఆరోగ్య విస్తరణాధికారి పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.