Nov 16,2022 23:58

నేవీ గేట్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఒబి నిర్వాసితులు

ప్రజాశక్తి - రాంబిల్లి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేవల్‌ బేస్‌ నిర్వాసితులు చేస్తున్న ఆందోళన బుధవారం నాటికి 17వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నేవీ మెయిన్‌ గేట్‌ ముందు రోడ్డుపై బైఠాయించి వేలాదిమంది నిర్వాసితులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది గ్రామాల పెద్దలు మాట్లాడుతూ నేవీ గేట్లు వెంటనే తీయాలని, ఆధార్‌ కార్డు ఆధారంతో లోపలకు పంపించాలి, వెంటనే జెట్టీ నిర్మాణం చేయాలని, పెండింగ్‌ ప్యాకేజీలు క్లియర్‌ చేయాలని, మగవాళ్లతో సమానంగా మహిళలకు ప్యాకేజీ ఇవ్వాలని, నేవల్‌ బేస్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే వేలాది మందితో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది నిర్వాసితులు పాల్గొన్నారు.