ప్రజాశక్తి-నెల్లూరు : రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, వడ్డిపాళెం లో ఆదివారం మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి అధికారం లోకి వచ్చి నారాచంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి క్రింద ప్రతి నెల రూ.1500లు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకొనే ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సహాయంగా అందజేస్తామన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకంలో ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, ప్రజలు తనను ఆదరించి ఓట్లేసి అత్యధిక మోజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఊటుకూరు దత్తాత్రేయ, గుంజి శ్రీనివాసులు, సుధాకర్ రెడ్డి, పంట్రంగి అజరు, ఉప్పు వెంకటేశ్వర్లు, కైలాసం సునీల్, బట్టా గిరిధర్, జితేంద్ర, నెల్లూరు బుజ్జమ్మ, పద్మజ, నాగరాజు, వల్లెపు బాబు, సుమన్, వెంకట రమణ, రాపూరు ప్రసాద్, సురేష్ పాల్గొన్నారు.










