ప్రజాశక్తి-బాపట్ల : గుంటూరులో ఈనెల 17న నిర్వ హిస్తున్న టైలర్స్ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర టైలర్స్ డెవలప్ మెంట్ చైర్ పర్సన్ షేక్ సుభాన్‌బి కోరారు. బాపట్ల జిల్లా టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవి ష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గుంటూరు ఏ-1 కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలో టైలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ట్రైలరింగ్ దుకాణాలకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితం ఇవ్వాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన టైలర్లకు వద్ధాప్య పింఛను మంజూరు చేయాలన్నారు. స్కూల్స్, కార్మికుల యూనిఫాం, ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన కుట్టు పనులు ఆయా ప్రాంతాల్లోని టైలర్లకే ఇవ్వాలన్నారు. రానున్న రోజుల్లో టైలరింగ్ అంతరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఔత్సాహికులైన టైలర్లకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల న్నారు. టైలర్స్ ఫెడరేషన్‌కు బడ్జెట్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్కీ నాగేశ్వరరావు కానుగుల, ఎస్‌కె. జానీ, ఎస్‌కె. ముగ్దుం బాషా, ఎస్‌కె. నసీబా, వేల్పుల వెంకటేశ్వర్లు , యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం. భాస్కర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉప్పలపాటి మాధవరావు, షేక్ జిలాని, వి.శ్రీనివాసరావు, కె.రవిక ుమార్, శేషగిరిరావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










