ప్రజాశక్తి -కంచరపాలెం : పెన్షనర్స్ డేను ఈ నెల 17వ తేదీన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ దీక్షా శిబిరంలో చేపట్టాలని ఆల్ పెన్సనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఎన్‌ఎడి జంక్షన్ వద్ద గల హష్మీ భవన్‌లో అసోసియేషన్ జిల్లా సమావేశం సోమవారం బిటి.మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ, మల్కాపురంలో కూడా పెన్షనేర్ ''డే'' చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7,8 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొన్న పెన్షనర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్ మాట్లాడుతూ, జంతర్‌మంతర్ వద్ద జరిగిన సదస్సు, ధర్నా వివరాలను వివరించారు. వచ్చే ఏడాది మార్చి నెలలో చేపట్టే ధర్నాను కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కనీస పెన్షన్ రూ.9,000 ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.










