ప్రజాశక్తి-పెందుర్తి : టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 17వ తేదీన విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పెందుర్తి టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, చంద్రబాబు సభ కృష్ణరాయపురంలోనా, సరిపల్లి, పెందుర్తి కూడలిలోనా అనే విషయాన్ని అనుమతి తీసుకున్న తర్వాత తెలియజేస్తామని చెప్పారు. చంద్రబాబు వస్తే సమస్యలు చెప్పుకోవడానికి చాలామంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టిడ్కో ఇళ్ల బాధితులతో ముఖాముఖి నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం లభించలేదని తెలిపారు. టిడిపి హయంలో చిన్న చిన్న మరమ్మతులకైనా అవకాశం ఉండేదని, వైసిపి వచ్చిన తర్వాత పూర్తిగా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బండారు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










