Jul 24,2022 23:23

రక్తదానం చేస్తున్న యువకులు

ప్రజాశక్తి-సింహాచలం: నవయువసేవ సంఘం ఆధ్వర్యాన అమ్మ బ్లడ్‌ బ్యాంక్‌ పర్యవేక్షణలో సింహాచలంలోని కర్రి అప్పలస్వామి కల్యాణ మండపంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. 175 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో సింహాచలంలో సేవలఅందించిన పలువురిని నవ యువ సేవా సంఘం సభ్యులు సన్మానించారు. ధైర్యంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ సతీష్‌కుమార్‌, ఆర్‌ఎంపి వైద్యులు కిషోర్‌, గోపాలపట్నం పోలీసులను, ఆశ వర్కర్స్‌ సునీత, లత, జివిఎంసి శానిటేషన్‌ సిబ్బంది బంగారుబాబు తదితరులు సన్మానించారు. ఈ బ్లడ్‌ బ్యాంక్‌ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కర్రీ సీతారాం, టిడిపి పార్లమెంటరీ కార్యదర్శి పాసర్ల ప్రసాద్‌, విశాఖ జిల్లా అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్‌, జనసేన భీమిలి ఇన్‌ఛార్జి పంచకర్ల సందీప్‌, 98వ వార్డు కార్పొరేటర్‌ పీవీ నరసింహం, సావిత్రిబాయి పూలే సంస్థల అధ్యక్షులు సీతా మహాలక్ష్మి, కర్రి అప్పలస్వామి, వైసిపి నాయకులు కొలుసు ఈశ్వరరావు ఎర్రవరం బాబు, లంక సత్తిబాబు కర్రి సత్తిబాబు టిడిపి నాయకులు సతివాడ శంకర్రావు, పంచదారల శ్రీనివాసరావు, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.