Dec 19,2022 23:06

ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న గీతం ప్రతినిధులు

జాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్వారా ఎంబిఎ, తదితర మేనేజ్‌మెంట్‌ కోర్సులు అభ్యసిస్తున్న 170 మందికి పైగా విద్యార్ధులకు ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు లభించినట్లు గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ డైరక్టర్‌ సోమయాజల వంశీకృష్ణ తెలిపారు. డెలాయిట్‌, ఎడిపి, ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, యుటిఐ ఎస్సెట్‌మేనేజ్‌మెంట్‌, పర్‌ఫెట్టి అండ్‌ సీషెల్‌ లాజిస్టిక్స్‌, ఆక్సెన్‌ పార్ట్‌నర్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫోఎడ్జ్‌, కెపిఎమ్‌జి వంటి ప్రముఖ కంపెనీలతో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తదితర సంస్థల్లో మార్కెటింగ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆపరేషన్స్‌, ఫైనాన్స్‌ వంటి ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. వీటిలో ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌ కంపెనీ గీతం విద్యార్ధులకు రూ.11.59 లక్షలు, ఇంటెలి ప్యాట్‌ సంస్థ రూ.9 లక్షలు, యుటిఐ సంస్థ రూ.7.96 లక్షలు, డెలాయిట్‌ రూ.7.86 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేసినట్లు డైరక్టర్‌ తెలిపారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఎంపికైన విద్యార్థులను గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ అమిత్‌భద్ర అభినందించారు. రానున్న నెలలో హిందుస్థాన్‌ లీవర్‌, నెస్లే, కోల్గేట్‌ పామోలీవ్‌, టర్నింగ్‌ మైండ్స్‌, ఫరఫెట్టీ మరికొన్ని సంస్థలు ప్రాంగణ నియామకాలను నిర్వహించునున్నాయని వెల్లడించారు.
ఎంపికైన విద్యార్ధులలో ఎంబిఎ విద్యార్ధిని సాహితీ ప్రయాగా మాట్లాడుతూ గీతంలో అందించిన నైపుణ్య శిక్షణ ద్వారా డెలాయిట్‌లో మొదట సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ లభించిందని, తద్వారా రూ.11.59 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడిందన్నారు. సీషెల్‌ లాజిస్టిక్స్‌ కంపెనీలు ఉద్యోగం సాధించిన పసుపులేటి ధనుష్‌ మాట్లాడుతూ ఇంటర్వూలను ఎదుర్కొనే విధానం, గీతం అధ్యాపకుల శిక్షణ తనకు ఉపయోగపడ్డాయని తెలిపారు. ఎంబిఎ విద్యార్ధులు టి.భవ్యమానవి, కర్ర సాయిరామ్‌ తాము ఉద్యోగాలు సాధించడంలో గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ అందించిన శిక్షణ, మార్గదర్శకం మరవలేనిదని పేర్కొన్నారు.