Nov 30,2022 18:07

ప్రజాశక్తి - గణపవరం
             17 శాతం తేమ ఉంటేనే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్‌, పౌరసరఫరాల శాఖ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి బి.బాలకృష్ణ అన్నారు. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్‌ మిల్లులను, సొసైటీలను ధాన్యాల ప్రక్రియపై ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆయనతో పాటు గణపవరం తహశీల్దార్‌ ఎం.సన్యాసిరావు, సొసైటీ కార్యదర్శి మద్దాల నారాయణ ఉన్నారు.