Feb 13,2023 23:03

ప్రజాశక్తి-విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ మీట్‌లో కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి కోరారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్న వివిధ రకాల పోటీలను అధికారులతో కలిసి లాటరీ విధానం ద్వారా పోటీ చేయు టీమ్‌ల వివరాలను మేయర్‌ ఎంపిక చేశారు. ప్రధానంగా ఈ స్పోర్ట్స్‌ మీట్‌లో 100, 400 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, 400 మీటర్ల నడక, షార్ట్‌పుట్‌, షటిలన బ్యాట్‌మెంట్‌, క్రికెట్‌, వాలీబాల్‌, కబాడీ, టెన్నిస్‌, చెస్‌, త్రోబాల్‌, టెన్నికాయిట్‌ వంటి పోటీలను నిర్వహించడం జరుగుతుందని మేయర్‌ వివరించారు. మేయర్‌ జట్టు, కమిషనర్‌ జట్టు, మునిసిపల్‌ రెవెన్యూ, ఇంజినీరింగ్‌, పబ్లిక్‌హెల్త్‌, టౌన్‌ప్లానింగ్‌, యుసిడి, ఎడ్యుకేషన్‌, రెవెన్యూ, మహిళా పోలీసు జట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ఆటల ప్రతిభను ప్రదర్శించనున్నట్లు మేయర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎంసి స్పోర్ట్స్‌మీట్‌ అధికారులు డిఎఫ్‌ఒ శ్రీనివాస్‌, అదనపు కమిషనర్‌ (జనరల్‌) ఎం శ్యామల, అదనపు కమిషనర్‌ (ప్రాజెక్ట్సు) కెవి సత్యవతి, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం ప్రభాకరరావు, సిటీ ప్లానర్‌ జివిజిఎస్‌వి ప్రసాద్‌, డిప్యూటీ సిటీ ప్లానర్‌ జుబిన్‌ శిరన్‌రారు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) డి వెంకటలక్ష్మి, ప్రాజెక్టు ఆఫీసర్‌ కె శకుంతల పాల్గొన్నారు.