ప్రజాశక్తి - ఆదోని
ఈనెల 17 నుంచి 19 వరకు నంద్యాలలో జరిగే 15వ ఎపి మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు కొర్రపాటి జయమ్మ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజరు బాబు కోరారు. సోమవారం ఆదోనిలోని బోయగేరిలో కరపత్రాలను మహిళలతో విడుదల చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేడు మహిళలు, చిన్నారులు, దళితులు, మైనార్టీలపై జరిగే నేరాలను అదుపు చేసేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, సిడి ట్రైల్స్ ద్వారా విచారణ జరిపి త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారన్నారు. సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు సుదర్శన్, కల్లుబావి రాజు, ఎఐటియుసి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఎంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఒబి.నాగరాజు, సిపిఐ నాయకులు హర్షద్, మెకానిక్ వలీ, సోమన్న పాల్గొన్నారు.