మాట్లాడుతున్న పెన్షనర్స్ సంఘం నాయకులు కుమార్
ప్రజాశక్తి- అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు చేస్తున్న అన్యాయంపై ఈనెల 16న విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద పెన్షనర్ల విద్రోహ దినం నిర్వహించనున్నట్టు పెన్షనర్ల సంఘం విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి కెపి.కుమార్ తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం సిఐటియు నాయకులు కాళ్ళ తేలయ్య బాబు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 7, 8 తేదీల్లో ఢిల్లీలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్.రంగారావు, సిహెచ్.సదానందరావు, బివి రమణబాబు, దాడి పైడిరాజు, కౌలు రైతు సంఘం నేత ఎ.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










