Sep 14,2023 22:31

రొంపిచర్ల : స్దానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ నెల 16న మండల స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌. జి. ఎఫ్‌) సెలక్షన్స్‌ జరుగుతాయని పాఠశాల ప్రధానో పాధ్యాయులు బియం సుభానీ, వ్యాయామ ఉపా ధ్యాయులు వై.సైదయ్య గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సెలక్షన్స్‌ లో పాల్గొనే క్రీడాకారులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, త్రోబాల్‌, టెన్నీకాయిట్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, యోగా, అథ్లెటిక్స్‌ వంటి 9 రకాల క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలో అన్ని జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాలల విద్యా ర్థులకు మండల స్థాయి ఎస్‌.జి.ఎఫ్‌ సెలక్షన్స్‌ జరుగు తాయని , ఈ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు తగిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.