
ప్రజాశక్తి-విజయనగరం : జగనన్న చేదోడు పథకం కింద కుల వృత్తులు చేసుకునే రజక, నాయీ బ్రాహ్మణులు, టైలరు వృత్తిదారులకు 4వ విడతగా ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేసారు. గురువారంకర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో జరిగే బహిరంగ సభలో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నాల్గవ విడత ఆర్థిక సహాయాన్ని జమ చేసారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగలక్ష్మి, బి.సి కార్పొరేషన్ ఇడి పెంటోజీ రావు, బిసి నాయకులు, లబ్ధిదారులు పాల్గొని వీక్షించారు. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జిల్లాలో 16893 మంది లబ్దిదారులకు రూ.16.89 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసింది. ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు.