ప్రజాశక్తి - సత్తెనపల్లి : ఈనెల 16 17 తేదీల్లో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కోట సాయికుమార్ కోరారు. ఈ మేరకు కరపత్రాన్ని గీత హాస్పిటల్ అధినేత డాక్టర్ గీత హాసంతి, లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ఈ వంశీకష్ణారెడ్డి, వంద కాలేజ్ డైరెక్టర్ గంగారపు అనూష, కౌలు రైతు సంఘం ఉపాధ్యక్షులు పెండ్యాల మహేష్ శుక్రవారం ఆవిష్కరించారు. డాక్టర్ గీత హాసంతి మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ 57 ఏళ్లకు పైగా అధ్యయనం పోరాటం నినాదాలతో, చదువుకునే ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించాలని ఎన్నో పోరాటాలు చేస్తోందని అన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌ను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు అమూల్య, ప్రసాదు, గోవింద్, విద్యార్థులు పాల్గొన్నారు.










