Nov 07,2023 01:16

మంగళగిరిలో ప్రచారం

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : విజయవాడలో ఈ నెల 15న సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్‌లో చిట్టేల సీతారామాంజనేయులు అధ్యక్షతన విస్తృత సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యాఅవసరాల ధరలను విపరీతంగా పెరిగాయని, ప్రజల ఆదాయాలు మాత్రం పెరగలేదని అన్నారు. పేదల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని చెప్పారు. మణిపూర్‌ దారుణాలపై కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన అంటకాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు విపరీతంగా పెంచారని వీటన్నింటికీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఎం.పకీరయ్య, యు.దుర్గారావు, జి.అజరు కుమార్‌, సిహెచ్‌.జనార్ధనరావు, సిహెచ్‌.సీతారామాంజనేయులు, బి.రాంబాబు, సిహెచ్‌.గిరిధరరావు, డి.పద్మనాభశర్మ, వి.రామారావు, ఎ.బాబ్జి, వి.సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు. కురగల్లులో పలుచోట్ల సమావేశాలు నిర్వహించారు. నాయకులు ఎం.భాగ్యరాజు మాట్లాడారు. డి.గణేష్‌, కె.నానయ్య, కె.సంజీవరావు పాల్గొన్నారు. చిన్నకాకానిలో కరపత్రాలను ఆవిష్కరించారు. వి.పూర్ణయ్య మాట్లాడారు. మంగళగిరి పట్టణంలోని గోపాలకృష్ణ సెంటర్లో ప్రచారం నిర్వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడారు. సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, పట్టణ నాయకులు టి.శ్రీరాములు, జి.వెంకయ్య, జె.వెంకటేష్‌, వి.దుర్గారావు పాల్గొన్నారు. మండల కేంద్రమైన మేడికొమడూరులో కరపత్రాలను ఆవిష్కరించి ప్రచారం చేయడంతోపాటు పడమర బజారులో సమావేశం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి బి.రామకృష్ణ మాట్లాడారు. కరిముల్లా, టి.బాజీ, సుభాని పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని బీసీ కాలనీలో ప్రచారం నిర్వహించగా డివిజన్‌ కార్యదర్శి కె.బాబుప్రసాద్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు పలు సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. ఆరు నెలలుగా రేషన్‌ సకాలంలో అందటం లేదని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.భవన్నారాయణ, నాయకులు హుస్సేన్‌వలి, ఎం.సాంబశివరావు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు మాట్లాడారు. ఎం.శ్రీనివాసరావు, ఎస్‌.కె కాసింవలి, సిహెచ్‌ శ్రీను, ఎం.శ్రీను, రాజు పాల్గొన్నారు.