Nov 05,2023 21:41

సాలూరులో పోస్టర్‌ విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజారక్షణ భేరి పేరిట ఈనెల 15న విజయవాడలో జరిగే బహిరంగ సభకు ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, సభ్యులు పాకల సన్యాసిరావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని 24, 25వ వార్డుల్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా రక్షణ భేరి కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే విద్యుత్‌ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపారన్నారు. నిత్యవసర ధరలు రోజురోజు పెరిగిపోతున్నప్పటికీ నియంత్రించడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో శిరేల శ్రీను, బుగత రామ, జవ్వాది పోలిరాజు, హనుమంతు శ్రీను, సామంతుల గౌరి, పద్మనాభం అప్పలరాజు, పద్మనాభం శ్రీను, పొన్నాడ బ్రహ్మానందం, పొన్నాడ శ్రీను, అప్పలనాయుడు, గొర్లి పార్వతమ్మ, కంగటి ధనలక్ష్మి, గొర్లి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 15న విజయవాడలో నిర్వహించనున్న బహిరంగ సభ కు ప్రజలు తరలిరావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు కోరారు. ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ నాయకులు టి.రాముడు, టి.ఇందు, నాగమణితో కలిసి ఆయన గోడపత్రికలను విడుదల చేశారు. ఈనెల15న విజయవాడలో నిర్వహించనున్న బహిరంగ సభలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివిరాఘవులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతారన్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని నాయుడు కోరారు.
కొమరాడ : అసమానతలు లేని రాష్ట్రం జిల్లా అభివద్ధి కోసం ఈనెల 15న విజయవాడలో జరిగే సిపిఎం ప్రజారక్షణభేరి ముగింపు బహిరంగ సభ కు భారీగా ప్రజలు కదిలి రావాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఈమేరకు కరపత్రాలను గుమడ సంత, నాగవల్లి అవతల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సిపిఎం నాయకులు ఉపేంద్ర, లక్ష్మణరావు, వెంకట్రావు, అప్పారావు, లచ్చం, పోలినాయుడు, సుబ్బారావు పాల్గొన్నారు.