Nov 11,2023 22:21

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిపిఎం ప్రజా ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని, నవంబర్‌ 15న విజయవాడ కేంద్రంగా జరుగుతున్న భారీ బహిరంగ సభకు తరలిరావాలని సిపిఎం నాయకులు పిలపునిచ్చారు. రాజమహేంద్ర వరం నగరంలోని శ్యామలసెంటర్‌లో సిపిఎం ప్రజా రక్షణ బేరి బహిరంగ సభ పోస్టర్‌ని సిపిఎం నాయ కులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీ యాలు సరవవేగంగా మారుతున్నాయని, రాజకీయ చర్చలన్ని ప్రధాన రాజకీయ పార్టీల చుట్టూ తిప్పు తున్నారు తప్ప ఉద్యోగులు, కార్మికులు, స్కమ్‌ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, ఇతర ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల ప్రస్తావన ఎక్కడా చర్చకు రానీయడం లేదన్నారు. అందుకే ప్రజా సమస్యలే ఎజండాగా సిపిఎం రాష్ట్రంలో మూడు బస్సు యాత్రలు చేపట్టిం దని, 30 అంశాలతో కూడిన ప్రజా ప్రణాళికను ప్రజల ముందు ఉంచిందని తెలిపారు. ఈ ప్రజా ప్రణాళిక అమలుకు రానున్న రోజుల్లో ప్రజలు అధికార, ప్రతిపక్ష పార్టీల మీద ఒత్తిడి తేవాలని అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో చేపట్టిన బస్సు జాతాలు ఈ నెల 14న విజయవాడకు చేరుకుంటాయని, 15న విజయవాడలోని ఎంబి. స్టేడియం లో భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం.ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్య దర్శి వి.శ్రీనివాస రావు పాల్గొని మాట్లాడతారని, కావున ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంమ నాయకులు బి.పవన్‌, బి.రాజులోవ, జువ్వ ల.రాంబాబు, ఎం.సుందరబాబు, పి.తులసి, బేబీరాణి, అన్నామని, వెంకటలక్ష్మి, రాంబాబు పాల్గొన్నారు.