
బెలగాం: అసమానతల్లేని రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగే సిపిఎం ప్రజారక్షణభేరి ముగింపు సభ ఈనెల 15న విజయవాడలో జరుగుతుందని, దీన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అంతా ప్రచారం, సభలు, సమావేశాలు, గ్రామ, వార్డు వీధి సమావేశాలు, పాదయాత్రలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా ప్రజా సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ, అసమానతల్లేని సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బిజెపి విధానాల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సిపిఎం ప్రజా రక్షణ భేరి యాత్ర జిల్లా అంతా విస్తృత ప్రచారం చేపట్టిందన్నారు. ఈ ప్రచారం అనంతరం ఈనెల 15 చలో విజయవాడ భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బివి రాఘవులు పాల్గొంటారని, కావున అన్ని తరగతుల ప్రజలు విజయవాడ తరలి రావాలని కోరారు. కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ, కె.రామస్వామి, పట్టణ కమిటీ నాయకులు బి.సూరిబాబు, వి.చిన్నంనాయుడు పాల్గొన్నారు.