ప్రజాశక్తి - ఆదోని
ఈనెల 15న జరిగే 'చలో విజయవాడ'లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్.రాధాకృష్ణ కోరారు. శనివారం ఆటోడ్రైవర్ల యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిఒ 21ని రద్దు చేయాలని, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 15న జరిగే 'చలో విజయవాడ'లో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయని తెలిపారు. యూనియన్ అధ్యక్షులు తిమ్మప్ప, జిల్లా ఉపాధ్యక్షులు వీరన్న, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్.గోపాల్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.తిమ్మప్ప, కె.ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బి.రాధాకృష్ణ, రవి, వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శులు హనుమంతు, వెంకటేశ్వర్లు, గోవిందు, రాజు, కృష్ణ, మనోహర్, ప్రభాకర్ ఉన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు