Oct 18,2023 23:13

ప్రజాశక్తి-వత్సవాయి: వచ్చే నెల 15న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం చిరుమామిళ్ల హనుమంతరావు అధ్యక్షతన విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివి కృష్ణ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని గద్దెదించి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. బిజెపి పాలనలో రాష్ట్రాలన్నీ దివాలా తీశాయన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ సైదులు, ఎన్‌సిహెచ్‌ శ్రీనివాసరావు, తమ్మినేని రమేష్‌, కంచర్ల కొండయ్య, రాయల వెంకటి, బి రాము, పెంటి కోటేశ్వరావు, వెంకయ్య, పటేల్‌, ఏసుపోగు వెంకటరత్నం, రాయల సుదర్శనం, కూరపాటి వెంకటి తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట: పట్టణంలోని డివిఆర్‌ నగర్‌లోని సుందరయ్య భవన్‌లో బుధవారం జగ్గయ్యపేట మండల సిపిఎం సభ్యులు, సానుభూతిపరులతో విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. నాయకులు జుజ్జువరపు వెంకటరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ 15న విజయవాడలో జరిగే బహిరంగ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కేంద్రంలో మోడీకి ఊడిగం చేస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ఓటమే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు, మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి, న్యాయవాదులు కాసరగడ్డ నాగేశ్వరరావు, దాసరి నాగేశ్వరరావు, కె శ్రీనివాసరావు, నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, కోటా కృష్ణ, కే రవికుమార్‌, కోటేశ్వరరావు, అర్‌ శేషు, రాంప్రసాద్‌, నాగమణి తదితరులు పాల్గొన్నారు.