గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-ఆలూరు
సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి మహా ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయలని సిపిఎం సీనియర్ నాయకులు కెపి.నారాయణ స్వామి కోరారు. శనివారం ఆలూరులోని బజారీ హమాలీ కార్మికులతో కలిసి గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ద్రోహం చేసిన కేంద్ర బిజెపిని గద్దె దించాలని కోరారు. బిజెపికి మద్దతు ఇస్తున్న వైసిపి, టిడిపి, జనసేనలకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని తెలిపారు. సిపిఎం నాయకులు నాగరాజు, వీరేష్, గోవర్ధన్, కార్మికులు పాల్గొన్నారు.