గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి - హోళగుంద
సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15న విజయవాడలో చేపట్టే మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం, సిఐటియు నాయకులు కోరారు. శనివారం స్థానిక బస్టాండ్‌లో గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్, సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ముగింపుగా విజయవాడలో కార్మిక, కర్షక, రైతు, ప్రజా ప్రదర్శన, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాయకులు ఉల్లిగయ్య, తిమ్మప్ప, సలీం, రాఘవేంద్ర, ఇబ్రహీం, ఎల్లప్ప పాల్గొన్నారు.