ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: యూనిఎక్స్‌పర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యుయస్‌ఎ, కెనడా అడ్మిషన్స్ డే నిర్వహిస్తున్నట్లు యూనిఎక్స్‌పర్ట్స్ ఎపి ఆపరేషన్ హెడ్ చైతన్య వాడవల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన బందర్ రోడ్ బెంజిసర్కిల్ వద్ధ గల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యుయస్‌ఎ, కెనడాలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం అడ్మిషన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో పది విశ్వవిద్యాలయాలు పాల్గొంటాయని తెలిపారు. నేరుగా వారితో మాట్లాడి అడ్మిషన్ పొంది స్కాలర్ షిప్ విధానాన్ని గురించి తెలుసుకొని స్పాట్ అడ్మిషన్ పొందేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అడ్మిషన్ డేలో పాల్గొనే విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని, మరిన్ని వివరాల కోసం 8978787855 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.










