15మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ప్రజాశక్తి - తిరుపతి (మంగళం)
రేణిగుంట ఆంజనేయపురం చెక్ పోస్టు, బాకరాపేట, రైల్వే కోడూరు పరిధిల్లోని మూడు ప్రాంతాల్లో 40ఎర్రచందనం దుంగలు, ఒక బొలేరో లగేజి వాహనం, రెండు కార్లు, రెండు మోటారు సైకిళ్లను టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 15మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు అధ్వర్యంలోని ఆర్‌ఐ సురేష్ కుమార్ రెడ్డి, కపానందలకు చెందిన మూడు టీమ్‌లు గురువారం కూంబింగ్, వాహనాల తనిఖీలు చేపట్టాయి. డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మూడు సంఘటనల్లో మూడు టీమ్‌లు చాకచక్యంగా వ్యవహరించి ఎర్రచందనం దుంగలను పట్టుకోగలిగినట్లు తెలిపారు. ఎర్రచందనం దుంగలు టన్నుకు పైగా ఉన్నాయని తెలిపారు. వాహనాలతో కలపి వాటి విలువు సుమారు రూ. కోటి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న టీమ్ లకు కర్నూలు రేంజి డీఐజీ, టాస్క్ ఫోర్సు ఇన్చార్జి సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కేసులను సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు మహన్ నాయక్, రఫీలు దర్యాప్తు చేస్తున్నారు.










