ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పర్చూరు మండలంలోని పోతుకట్ల విజయ గణపతి దేవాలయం ప్రాంగణంలో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి రోటరీ సభ్యులు కోట శ్రీనివాసరావు, ప్రసన్న దంపతులు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నాగభైరు శ్రీనివాసరావు మాట్లాడుతూ దాతలను అభినందించారు. వైద్యులు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇసిజి, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరంలో క్లబ్ కార్యదర్శి పంబి సదానదందరెడ్డి, పి వెంకన్న, కొమర్నేనివారిపాలెం సర్పంచ్ మున్నంగి వెంకటసుబ్బయ్య, కల్లం వీరారెడ్డి, డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ రాణి, కో ఆర్డినేటర్ రఫి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










