
- ఎపి జోన్‌కో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్
ప్రజాశక్తి-సీలేరు
సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్ మరమ్మతు పనులు మరో 15 రోజుల్లో పూర్తిచేసి అందుబాటులో తీసుకొస్తామని ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ బి.శ్రీధర్ తెలిపారు. జీకే వీధి మండలం సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి నాలుగో యూనిట్ మరమ్మత్త పనులను పరిశీలించారు. యూనిట్ మరమ్మతులు శరవేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఈఈ లక్ష్మీనారాయణను ఆదేశించారు. స్థానిక రెగ్యులేటరీ డ్యాము రెండు, మూడు, ఆరు గేట్లు రబ్బర్ సీల్స్ అరిగిపోవడంతో గేట్లు కింద భాగం నుంచి నీరు లీకేజీని అరికట్టేందుకు గేట్లకు కొత్త రబ్బరు సీల్స్ అమర్చే పనులను చీఫ్ ఇంజనీర్ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ చేపడుతున్న గేట్లు మరమ్మతు పనులలో నాణ్యత లోపాలు తలత్తకుండా ఎప్పటికప్పుడు పరివేక్షించాలని సీలేరు కాంప్లెక్స్ ఎస్‌ఈ సివిల్ కెకెవి.ప్రశాంత్ కుమార్, ఈఈ ప్రభాకర్‌ను ఆదేశించారు. మెయిన్ డ్యామ్, రెగ్యురేటరీ డ్యామ్ పైన విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. సీలేరు రిజర్వాయర్లో నీటి నిల్వలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మోతుగూడెం ఓ అండ్ డ్యామ్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, డిఈ టెక్నికల్, ఈఈలు బాలకృష్ణ, ప్రభాకర్, ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.