ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్ తలసేమియా భవనంలో బుధవారం 15 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్‌ఎస్‌ఆర్ కె.వరప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు క్రమం తప్పకుండా తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహిస్తున్నామని, ఇందుకు స్వచ్ఛంద రక్తదాతల సహకారం మరువలేనిదని అన్నారు. బుధవారం తలసేమియా చిన్నారులతో పాటువారి తల్లిదండ్రులు 35 మందికి ఉచిత భోజన ఏర్పాటు చేసిన దాతలు, మానవత సభ్యులు బావిశెట్టి చిరంజీవి రావు, పద్మావతి దంపతులకు, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేసిన లైన్స్‌క్లబ్ సభ్యురాలు కె.పద్మజకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ, డాక్టర్ వరప్రసాదరావు, లైన్స్‌క్లబ్ సభ్యులు కె.పద్మజ, పి.అనురాధ పాల్గొన్నారు.










