Nov 16,2023 21:53

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ ఆనందరావు

ప్రజాశక్తి - వీరఘట్టం :  డిసెంబరు 15వ తేదీ నుండి నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు 15 ఏళ్లు దాటిన వారంతా పోటీలకు అర్హులని ఎంఇఒ ఆర్‌.ఆనందరావు వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన క్రీడాకారులను వాలంటీర్‌ ద్వారా గుర్తించి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు చొరవ చూపాలన్నారు. డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు సచివాలయాల పరిధిలో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, క్రికెట్‌ షటిల్‌ బ్యాట్మెంట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే 21నుంచి వీరఘట్టం జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆసక్తి గల ప్రతి క్రీడాకారుడు పోటీలో పాల్గొనేలా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఎం.రామకృష్ణ, ఎస్‌ఎంఒ ఎస్‌ ఉమామహేశ్వరరావు, ఎస్‌ పద్మరాజు, కె.సాల్మన్‌రాజు, పోలిరాజు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.