Mar 11,2023 16:14

అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్ఓ

14న  జాతీయ నులిపురుగుల నిర్మూలన  దినోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టర్

     ఈనెల 14వ తేదీన జరుగు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ సంబంధిత వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం యం. ఎస్. నగర్,  గాంధి నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి డా.వెంకటరమణ  ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా  ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలకు ఆల్ బెండ జోల్ -400 మి. గ్రా నులిపురుగుల మాత్రల పంపిణి వివరాలు, కార్యక్రమం పర్యవేక్షణ ఏర్పాట్లు గురించి వైద్యాధికారులను విచారించారు. రెండు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల వివరాలు, 1-19 సంవత్సరాల లబ్ధిదారుల వివరాలు, అంగన్వాడీ కేంద్రాలు, అందులో ప్రీ స్కూల్  3-6 సంవత్సరాల పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ నులి పురుగుల నిర్ములన కార్యక్రమం మార్చి 14 వ తేది వంద శాతం విజయవంతం చేయలన్నారు.కార్యక్రమంలో పాల్గొనే సమన్వయ శాఖల మండల అధికారులు,  విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, కార్యక్రమం పర్యవేక్షణ సిబ్బంది సమన్వయము తో కలిసి పని చేయాలని వైద్యాధికారులకు సూచించారు. నంద్యాల జిల్లాలో మొత్తం 1-19 సంవత్సరముల లబ్ధిదారులు 4 లక్షల మంది ఉన్నారని, ఆల్ బెండ జోల్ -400 mg మాత్రలు జిల్లాలో  మండల పరిషత్ అభివృద్ధి  అధికారుల ద్వారా వారి పరిధిలో ని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలకు, ప్రాధమిక పాఠశాల ల నుండి డిగ్రీ మొదటి సంవత్సరము మరియు వృత్తి విద్యా సంస్థలలో చదువున్న విద్యార్థుల వరకు  మాత్రలు జిల్లా కలెక్టరు వారి ఆదేశాల ప్రకారం పంపిణి చేయడం జరిగినదని, కార్యక్రమం అమలులో ఎలాంటి పొరబాట్లు జరగకుండా వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు వహించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా ఇంచార్జి అధికారి డా.కాంతారావు నాయక్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి వెంట ప్రోగ్రాం పర్యవేక్షణ అధికారులు  డా.కాంతారావు నాయక్, డా.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.