Mar 11,2023 00:31
నక్కపల్లిలో మాత్రలు అందజేస్తున్న అధికారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:ఈనెల 14న మంగళవారం నిర్వహించనున్న డి వార్మింగ్‌ డేను విజయవంతం చేయాలని ఎంపీడీవో సీతారామరాజు కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం గొడిచెర్ల పిహెచ్‌ సి వైద్యాధికారి కిషోర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు, ఎంఈఓ డివిడి ప్రసాద్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఎంపీడీవో మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు, అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ మాత్రలను వేయాలని సూచించారు. వైద్యులు కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ, మండలంలో 15,105 మందికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం మాత్రలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అందజేశారు.
కోటవురట్ల:ఈనెల 14న నిర్వహించే జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా గ్రామస్థాయి అధికారులు సహకరించాలని పిహెచ్‌సి వైద్యులు సంతోష్‌ కుమార్‌ తెలిపారు. మండల సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి అధికారుల సమావేశంలో సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా దాదాపు 4286 మందికి నులి పురుగులు మందు అందజేయాల్సి ఉందన్నారు. అనంతరం మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో చంద్రశేఖర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అప్పారావు, హౌసింగ్‌ ఏఈ జగదీశ్వరరావు పాల్గొన్నారు.
మాకవరపాలెం: 14న నులిపురుగులు మందులు పంపిణీ చేయాలని ఎంపీడీ అరుణ శ్రీ కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారి శ్రీవిద్య, బూరుగుపాలెం పిహెచ్సి సిబ్బంది, అంగన్వాడిలు పాల్గొన్నారు.
యస్‌.రాయవరంఎంపిడివో కార్యాలయంలో డి వార్మింగ్‌ డే సందర్భంగా వైద్య సిబ్బందికి మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యాధికారులు శక్తి ప్రియ, నాయక్‌, ఎంఈఒ మూర్తి పాల్గొన్నారు.
అచ్యుతాపురం:స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం అదనపు డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ శారదాబాయి చేతుల మీదుగా ఆల్బెండజోల్‌ మాత్రలను శుక్రవారం ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 14న జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాది వయసు నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు వారికి భోజనం అనంతరం ఈ మాత్రలు మింగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సిఆర్‌కే దేవరాయలు వైద్యులు డాక్టర్‌ రజిని, కళ్యాణి, ఆరోగ్య పర్యవేక్షకులు ఏరుకు నాయుడు, హెల్త్‌ అసిస్టెంట్‌ లండ అప్పలకొండ పాల్గొన్నారు.
కశింకోట : పులి పురుగుల నివారణ మాత్రలు శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి రోజారాణి పాఠశాలల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సంందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లలు తిండి ఇష్టపడక పోవడం జరుగుతుందని, అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కొంకి అప్పారావు, కశింకోట, తాళ్ళపాలెం వైద్యాధికారులు తిరుపతి రావు, రమేష్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమేష్‌, అభిషేక్‌ అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ ఝాన్సీ రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆనందపురం : జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఏడాది నుంచి 19ఏళ్ల వయస్సున్న పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను వేయించనున్నట్లు ఆనందపురం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ కోరాడ శైలజ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పాఠశాల ఉపాధ్యాయుల, .అంగన్వాడీ టీచర్లుతో సమావేశం నిర్వహించి, మాత్రలను అందజేశారు. డాక్టర్‌ సెహనాజ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఐ. గోవిందరావు. సెక్రెటరీ కరుణాకర్‌, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌, ఫార్మసిస్ట్‌ జయకుమార్‌. హెల్త్‌ అసిస్టెంట్‌లు సత్తిరాజు. తారకేష్‌ పాల్గొన్నారు.