Sep 09,2023 23:25

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం 
            శశి ఇంజినీరింగ్‌ కళాశాల జాతీయ సేవా పథకంలో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం ఎఫ్‌సిఐ కాలనీలో ఉన్న శాంతి రెసిడెన్షియల్‌ పాఠశాల, హాస్టల్‌లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. భీమవరం విష్ణు దంత వైద్య కళశాల, హాస్పిటల్‌ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విష్ణు కళాశాల క్యాంపు ఇన్‌ఛార్జి డాక్టర్‌ పి.ఆదిత్య, వారి సిబ్బంది పాల్గొన్నారు. శశి ఇంజినీరింగ్‌ కళాశాల వారి సహకారంతో హాస్టల్‌ విద్యార్థులకు ఉచితంగా వైద్యం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ మాట్లాడుతూ హాస్పిటల్‌ సిబ్బందికి, కళాశాల వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. 140 పిల్లలకు, పెద్దలకు దంత పరీక్షలు నిర్వహించామని కో-ఆర్డినేటర్‌ సల్మాన్‌ బాషా తెలిపారు.