Mar 10,2023 00:14

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ : సమాజంలో సామాజిక బాధ్యతను పెంపొందించాలనే సంకల్పంతో గత 12 సంవత్సరాలుగా కళను ఆయుధంగా చేసుకొని సామాజిక ఇతివత్తాలను ప్రజలకు చేరువచేస్తూ కళా రంగాల ద్వారా సామాజిక మార్పుకోసం శ్రీకారం స్వచ్ఛంద సంస్థ, సామాజిక అభివద్ధి,ప్రపంచ శాంతి కోసం రోటరీ సంస్థ కషి చేస్తున్నట్లు శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు, జాస్ఠి అనురాధ మోహన్‌రావు తెలిపారు. మార్టూరులోని ఎఫర్ట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 14 నుంచి 16 వరకూ బాపట్ల జిల్లా మార్టూరు నాగరాజుపల్లి సెంటర్‌ సమీపంలోని మద్దిసత్యనారాయణ కంపెనీ ఆవరణలో శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో 13 వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల14 న నాటిక పోటీలను రోటరీ 3150 జిల్లా గవర్నర్‌ తాళ్ల రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. పోటీల అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సన్మానించనున్నట్లు తెలిపారు. సామాజిక ఇతివత్తాలతో మూడు రోజులు జరగనున్న నాటిక పోటీలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు కొర్రపాటి కాజారావు, కుర్రా వెంకటరామయ్య, రోటరీ 23-24 అసిస్టెంట్‌ గవర్నర్‌ ఇంటూరి ఆంజనేయులు, రోటరీ మాజీ అధ్యక్షుడు రావి అంకమ్మ చౌదరి, బసవరాములు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రదర్శించే నాటికలు ఇవే...
శార్వాణి ఫైన్‌ ఆర్ట్స్‌ బొరివంక ఆధ్వర్యంలో బిఎంఎస్‌ పట్నాయక్‌ దర్శకత్వంలో కెకెఎల్‌ స్వామి రచించిన కొత్త పరిమళం, శ్రీ సాయి ఆర్ట్స్‌ కొలకలూరు ఆధ్వర్యంలో గోపరాజు విజరు దర్శకత్వంలో రావి నాగేశ్వరరావు రచించిన ప్రేమతో నాన్న, గంగోత్రి పెదకాకాని వారి ఆధ్వర్యంలో నాయుడు గోపి దర్శకత్వంలో డాక్టర్‌ సిహెచ్‌.శ్రీనివాసరావు రచించిన పేగు రాసిన శాసనం, జనచైతన్య ఒంగోలు ఆధ్వర్యంలో వరికూటి శివప్రసాద్‌ రచించి దర్శకత్వం వహించిన చేతివ్రాత నాటికలు ప్రదర్శించనున్నారు.